MLG: వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలోని ముస్లిం శ్మశానవాటిక, మదీనా మసీదు వక్ఫ్ భూములను రక్షించాలని మహ్మద్ సర్వర్ అహ్మద్ గురువారం జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులను కోరారు. వక్ఫ్ భూములను కొందరు అక్రమంగా ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 1995 నుంచి ఆ భూమిలో మసీదు, శ్మశానవాటిక నిర్వహిస్తూ ప్రార్థనలు, అంత్యక్రియలు జరుగుతున్నాయని తెలిపారు.