JGL: గోవధ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల పట్టణ ఏరియా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పశు వధ శాలలను గురువారం వారు తనిఖీ చేశారు. బక్రీద్ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి గోవులను వధించకుండా తనిఖీలు చేపట్టారు. రైతులు కిరణ్ రెడ్డి, బద్దం రాజేందర్ రెడ్డి తిరుపతి గౌడ్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.