KMR: జిల్లాలో అకాల వర్షాలకు రామారెడ్డి, దోమకొండ మండలాల్లో తడిసిన 1,064 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాలతో అధికారులు యుద్ధప్రాతిపదికన పార్బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించారు. జిల్లాలో ఇప్పటివరకు రూ.914.41 కోట్ల విలువైన 3,82,760 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, 86 శాతం నిధులు (రూ.783.57 కోట్లు) ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.