MNCL: లక్షెట్టిపేట మండలంలోని తిమ్మాపూర్‌కు లింగంపల్లి అజయ్(19) అనారోగ్యంతో బాధపడుతూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై జి.సురేష్ తెలిపారు. అజయ్ 9 నెలల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చూపించి మందులు వాడిన నయం కాలేదన్నారు. 26న నొప్పి రావడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.