AP: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతకు చేస్తున్న కృషికి BJP, జనసేన అందిస్తున్న సహకారం మరువలేనిదని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ‘దీపం 2.0లో మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం వంటి పథకాలు విజయవంతం కావడం వెనుక పవన్ అన్న ప్రోత్సాహం ఎంతో ఉంది’ అని ట్వీట్లో పేర్కొన్నారు.