హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలోని దుర్గం చెరువు, ఎస్ఆర్ నగర్, మణికొండ, కూకట్పల్లి ప్రాంతాల్లో భూగర్భ జలాల మట్టం ఆందోళనకరంగా తగ్గుతోంది. తాగునీటి సరఫరా కొనసాగుతున్నప్పటికీ నిత్యావసర అవసరాల కోసం అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు ట్యాంకర్ నీటిపైనే ఆధారపడుతున్నాయి. ఈ నాలుగు ప్రాంతాల్లో భూగర్భ జలాలు సగటున 35 మీటర్ల లోతుకు పడిపోవడంతో బోర్లు ఎండిపోతున్నాయి.