CTR: పుంగనూరు కోర్టులో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని న్యాయవాదుల సంఘ అధ్యక్షులు విజయకుమార్ కోరారు. బుధవారం చిత్తూరులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారికను పుంగనూరు బార్ అసోసియేషన్ తరపున వారు కలిశారు. కోర్టుకు నూతనంగా జడ్జ్ను నియమించినందుకు గాను వారు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కోర్టులు నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.