AP: ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు రాష్ట్ర BJP అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. ఈ మేరకు జూన్-1 నుంచి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని, ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు.