ATP: గుత్తి పట్టణంలోని తాడపత్రి రోడ్డులో రోడ్డు దాటుతున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని బైకు అతివేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తము ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.