CTR: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి అందిన దరఖాస్తులకు పారదర్శకంగా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటి కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. పరిశ్రమల స్థాపన వల్ల వచ్చే రాయితీలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.