బాపట్ల జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిగా ఏ. జగన్మోహన్ రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన అనంతపురం జిల్లా ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీగా విధులు నిర్వహిస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ డీఎస్ఓగా సేవలందించిన జమీర్ రోషన్ బాషాను పల్నాడు జిల్లా అసిస్టెంట్ సప్లై ఆఫీసర్గా బదిలీ చేశారు.