NRPT: ఊట్కూర్ మండలం బిజ్వార్లో విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పి.వై.ఎల్. జిల్లా కార్యదర్శి సిద్ధు మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆజాద్ పోరాట పటిమ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.