BHPL: మహాదేవపురం మండలం కాళేశ్వరలో సరస్వతి పుష్కరాల్లో భాగంగా బుధవారం ఏడో రోజు కాళేశ్వరంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. పుణ్యస్నానాల అనంతరం భక్తులు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు మజ్జిగ, తాగునీరు అందిస్తున్నారు.