VZM: ఎస్.కోట నియోజకవర్గంలో మహానాడు వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కొత్తవలస మండలం తుమ్మికాపల్లిలో జరిగిన మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్రపటానికి ఆమె ఘన నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.