WGL: వరంగల్ నగరంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి సీకేఎం ఆసుపత్రికి వెళ్లే రహదారిపై ఉన్న ఆక్రమణలను బుధవారం పోలీసులు తొలగించారు. చిరువ్యాపారులు, పూల దుకాణాల కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారాయి. ప్రసూతి కోసం వచ్చే గర్భిణులు, అంబులెన్సులు, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, తాజా చర్యతో రహదారి క్లియర్ అయ్యింది.