SKLM: అమరావతిలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహానాడు కేవలం ఒక సమావేశం కాదని, తెలుగు ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు ప్రతి బింబమని అన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి కార్యకర్తలు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.