బక్రీద్ పండుగను పురస్కరించుకుని శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా విస్తృత భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశించారు. మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ముస్లింలకు ఎస్పీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.