MBNR: జిల్లా ఎస్సీ సెల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రెసిడెంట్ పసుల రాజు నియమితులయ్యారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ రాజేంద్ర పాల్ గుప్తా, రాష్ట్ర ఛైర్మన్ ప్రీతం చేతులమీదుగా గాంధీభవన్లో ఆయన నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి, దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.