TG: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ప్రజలకు పలు సూచనలు చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపారు. రైతులు, ఆటో డ్రైవర్లు, గిగ్ వర్కర్స్, ఇతర పనులు చేసే వాళ్లందరూ అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.