BDK: జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవలు, ఔషధాల నిల్వలు, గర్భిణీల రిజిస్టర్లు, టీకాల కార్యక్రమ అమలును పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. EDD క్యాలెండర్ ప్రకారం గర్భిణీలను పర్యవేక్షించాలని అన్నారు.