SRPT: కోదాడ పట్టణ పరిధిలోని దుర్గాపురం బైపాస్ వద్ద నిన్న అర్థరాత్రి భారీ గాలి దుమారం సంభవించింది. ఈదురుగాలులకు ఒక హోటల్ షెడ్లు ఎగిరిపోయి, సామగ్రి చెల్లాచెదురైంది. ఈ ఘటనతో అక్కడ ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే స్థానికులు, నిర్వాహకులు నష్టాన్ని పరిశీలించారు. పట్టణ పరిసర ప్రాంతాల్లో కూడా పలుచోట్ల నష్టం జరిగినట్లు సమాచారం.