ELR: గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నపుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని జంగారెడ్డిగూడెం DLDO రాజు అన్నారు. బుధవారం లక్కవరం గ్రామాన్ని పరిశీలించారు. ప్రతివారం గ్రామాల్లో పర్యటిస్తానని ఎక్కడ చెత్త కుప్పలు కనిపించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని తెలిపారు. తడి చెత్త, పొడిచెత్త వేరుచేయడం, కంపోస్ట్ షెడ్లో సెగ్రీగేషన్, డంపింగ్ యార్డ్ తనిఖీ చేస్తామన్నారు.