NDL: శ్రీశైలం జలాశయం వద్ద అర్ధరాత్రి చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. జలాశయం వ్యూ పాయింట్ సమీపంలోని కేబుల్ వే రూమ్ కింద రాళ్లపై చిరుతపులి సేద తీరుతూ కనిపించింది. దీంతో జలాశయం వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. జలాశయం పరిసరాల్లో తరచుగా చిరుత సంచారంతో ఆందోళనకు గురవుతున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.