MNCL: జన్నారం మండలంలో కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు హామీ ఇచ్చారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జన్నారం మండలంలో కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యంతో పాటు బస్తాలు తడిసిపోయాయన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందన్నారు.