కేరళం మాజీ సీఎం పినరయి విజయన్‌కు బిగ్ షాక్ తగిలింది. విజయన్‌తో పాటు బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ తనిఖీలకు దిగింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మొత్తం 10 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయన్ కుమార్తె వీణ అవినీతి కేసులో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.