గుజరాత్ టైటాన్స్ పేసర్ కగిసో రబాడ సరికొత్త చరిత్ర సృష్టించాడు. RCBతో జరుగుతున్న తొలి క్వాలిఫయర్‌లో రబాడ 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో IPL చరిత్రలో ఒకే సీజన్లో పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మహమ్మద్ షమీ (18 వికెట్లు) సరసన అగ్రస్థానంలో నిలిచాడు. వీరి తర్వాతి స్థానాల్లో మిచెల్ జాన్సన్ (16 వికెట్లు), ట్రెంట్ బౌల్ట్ (16 వికెట్లు) ఉన్నారు.