RCBతో జరుగుతున్న తొలి క్వాలిఫయర్లో GT కష్టాల్లో పడింది. 255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. 27 పరుగులకే ఓపెనర్లు గిల్ (2), సుదర్శన్(14) వికెట్లను కోల్పోయింది. డఫీ వేసిన బంతిని సుదర్శన్ బౌండరీ బాదాడు. అయితే, అదే సమయంలో అతడి చేతిలోని బ్యాట్ జారిపోయి వికెట్లకు తగిలింది. దీంతో ‘హిట్ వికెట్’గా పెవిలియన్ చేరాడు. మరోవైపు గిల్ను భువనేశ్వర్ బౌల్డ్ చేశాడు.