GTతో జరుగుతున్న తొలి క్వాలిఫయర్లో RCB కెప్టెన్ రజత్ పటిదార్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 93 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో అతడు కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో ప్లేఆఫ్స్ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో సెహ్వాగ్ (21)తో కలిసి 5వ స్థానంలో నిలిచాడు. రైనా (16) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.