IPL 2026 క్వాలిఫయర్-1లో భాగంగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో RCB బ్యాటర్లు జోరు పెంచారు. కుల్వంత్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యా రెండు ఫోర్లు, పాటిదార్ రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. ఇదే ఓవర్లో కుల్వంత్ 2 నోబాల్స్, 1 వైడ్ వేశాడు. దీంతో మొత్తం 28 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి RCB.. 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.