SRD: జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన సమావేశంలో, సైబర్ నేరాల బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని SP పరితోష్ పంకజ్ ఆదేశించారు. ముఖ్యంగా రూ. 50000 లోపు డబ్బు కోల్పోయిన బాధితులకు ఆ మొత్తాన్ని తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.