SDPT: అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఎత్తైన ప్రదేశాల్లో నిల్వ చేసి టార్ఫాలిన్తో కప్పాలని జిల్లా కలెక్టర్ అధికారులు, రైతులకు సూచించారు. వరి, మక్కల కొనుగోళ్లు ఒకేసారి కొనసాగడంతో హమాలీలు, లారీల కొరత ఉన్నప్పటికీ కొనుగోళ్లు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. సన్ ఫ్లవర్ కొనుగోలుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.