WNP: జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు సేకరించిన ధాన్యంతో పాటు ఇంకో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కనుగొను కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ తెలిపారు. రైతులు, కాంట్రాక్టర్లవి కలిపి సుమారు 600 వాహనాల్లో దాన్యం తరలిస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా ముగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.