VSP: జీవీఎంసీ పరిధిలో ‘జనగణన-2027’ ఇండ్ల గణన ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి తెలిపారు. మే 26 నాటికి నగరంలో 9,13,600 ఇండ్ల గణన పూర్తయిందని, 1,47,528 ఇళ్లు ఖాళీగా ఉండగా, 37,358 ఇళ్లకు తాళాలు వేసి ఉన్నట్లు గుర్తించామన్నారు. దేశ ప్రణాళికలు, సంక్షేమ పథకాలకు ఈ డేటా కీలకమని పేర్కొన్నారు.