కోనసీమ: రామచంద్రపురం పట్టణంలోని పలు వార్డుల్లో మంత్రి సుభాష్ మంగళవారం పర్యటించి పారిశుధ్య నిర్వహణ, డ్రైన్ల పూడికతీత పనులు, రోడ్ల పరిస్థితులను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ రాజు, డి.ఈ శ్రీకాంత్‌లు పట్టణంలో కొనసాగుతున్న శానిటేషన్ పనులపై మంత్రికి వివరించారు. స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలలో భాగంగా పారిశుధ్యం పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.