GDWL: ఉపాధి కూలీలకు ముఖ గుర్తింపు రద్దు చేసి పాత పద్ధతినే కొనసాగించాలని సీపీఎం జిల్లా నేత ఉప్పేర్ నరసింహ డిమాండ్ చేశారు. రేవులపల్లిలో ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక లోపాల వల్ల 65 మంది ఉపాధి కోల్పోయారని, కూలి తక్కువ వస్తోందని మండిపడ్డారు. భీంపురం తదితర గ్రామాల్లో పనులను ప్రారంభించాలన్నారు. జూన్ 20న మహబూబ్నగర్ మహాసభలను జయప్రదం చేయాలన్నారు.