BDK: మణుగూరు మండల పరిధిలో ఉన్న ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ వ్యవహారశైలిపై సొంత పాలకవర్గమే ఇవాళ తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. సర్పంచ్ హోదాలో ఉంటూనే, గిరిజన ఇసుక సొసైటీ (MACS) అధ్యక్షురాలిగా అదనపు బాధ్యతలు నిర్వహించడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన వార్డు సభ్యులు, ఏకంగా జిల్లా పంచాయతీ అధికారి(DPO)కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.