TG: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి, తన భార్యతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ‘మావోయిస్టు కార్యకలాపాలను నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలి. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం సాయమందిస్తోంది’ అని తెలిపారు.