WGL: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని సీపీఐ నాయకులు అన్నారు. CPI మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవో ద్వారా సీఎంకు వినతిపత్రం అందజేశారు. మహిళలకు మహాలక్ష్మి, నిరుద్యోగులకు భృతి, వృద్ధులు, వితంతువులకు పెంచిన పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లను వెంటనే అమలు చేయాలని కోరారు. గ్రామసభల్లో దరఖాస్తులు చేసుకున్న వారికి ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.