నటి నివేదా థామస్ తమ్ముడు నిఖిల్ థామస్ ‘బెంగళూరు మహానగరంలో బాలక’ (BMB) చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమవుతున్నాడు. మహి–రాజ్ దర్శకత్వంలో, బెంగళూరులో ఓ ఆంధ్ర కుర్రాడు ఎదుర్కొనే సవాళ్ల నేపథ్యంలో ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. వరంగల్, హనుమకొండల్లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది.