NLR: సంగంలోని పెన్నా నదిలో మంగళవారం ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. వాళ్లు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు రేబాలకు చెందిన సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.