KRNL: బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, వివిధ వర్గాల నాయకులతో పోలీస్ అధికారులు సమావేశమయ్యారు. పండుగలో సామరస్య వాతావరణం కొనసాగింపుకు పోలీసులకు సహకరించాలని కోరారు.