ELR: ఆఫ్రికాలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర పౌర విమానయానశాఖ ఆదేశాల మేరకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. విదేశీ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు చేసినట్లు తెలిపారు.