ATP: ఈనెల 30లోగా ప్రతి ఇంటి యజమాని ఇళ్ల గణన వివరాలు నమోదు చేయించుకోకపోతే కఠినచర్యలు తప్పవని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో జేసీ విష్ణుచరణ్తో కలిసి ఆయన సమీక్షించారు. జనగణన-2027లో భాగంగా ఈనెల 1 నుంచి ఇళ్ల గణన మొదలైందన్నారు. ఇప్పటిదాకా 7,22,739 ఇళ్లల్లో వివరాలు నమోదయ్యాయని చెప్పారు.