ADB: TPCC ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన కుర్మే మహేందర్‌ను బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ ఆధ్వర్యంలో నేరడిగొండలో సోమవారం ఘనంగా సన్మానించారు. గజేందర్ మాట్లాడుతూ.. మహేందర్‌కు రాష్ట్ర స్థాయి బాధ్యతలు రావడం నియోజకవర్గానికి గర్వకారణం అన్నారు. దళిత సమాజం అభివృద్ధికి తోడ్పాటును అందించాలని పేర్కొన్నారు.