MLG: తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మల దర్శనం ముగించుకుని సోమవారం తిరుగు ప్రయాణమైన భక్తుల కారు ప్రమాదానికి గురైంది. నర్సంపేటకు చెందిన సాయి, తన స్నేహితులు అనిల్, అజయ్లతో కలిసి వెళ్తుండగా టైరు పేలిపోవడంతో కారు నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయి అక్కడికక్కడే మృతి చెందగా, అనిల్, అజయ్ తీవ్రంగా గాయపడ్డారు.