CTR: వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లంలో జరుగుతున్న మహాభారత ఉత్సవాల్లో భాగంగా సోమవారం చిత్తూరు వైసీపీ ఇంఛార్జ్ విజయానంద రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.