CTR: పుంగనూరులో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. పలు ప్రాంతాల్లో నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు ఉదయం నుంచే నీటి కోసం బిందెలతో సుదూర ప్రాంతాలకు వెళ్లి బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తక్షణ చర్యలుగా అదనపు వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.