SKLM: సోంపేట మండల వ్యవసాయ కార్యాలయంలో సోమవారం 50% రాయితీపై పచ్చిరొట్ట ఎరువు విత్తనాల పంపిణీ జరిగింది. పచ్చిరొట్ట సాగుతో ఎరువుల వాడకం తగ్గి, భూసారం పెరిగి దిగుబడులు పెరుగుతాయని కూటమి నాయకులు తెలిపారు. రైతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ రాయితీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏఏవో ఐశ్వర్య కోరారు.