AKP: అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని కోటవురట్ల జడ్పీటీసీ ఎస్.ఉమాదేవి అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు తమను ఆహ్వానించడం లేదని విమర్శించారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో స్వచ్ఛ రిక్షాల పంపిణీకి తనతో పాటు వైసీపీకి చెందిన ఎంపీటీసీలను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.