MDK: మెదక్ మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వీచిన గాలిదుమారం, భారీ వర్షానికి మంభోజిపల్లి, పేరూరు, ఎల్లాపూర్ గ్రామాల్లో చెట్లు నేలకూలాయి. మంభోజిపల్లిలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ దెబ్బతిన్నట్లు విద్యుత్ అధికారి నవీన్ తెలిపారు. గాలివాన తీవ్రత వల్ల ఈ గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.